6 నెలలు, 30 సర్వేల్లో వెల్లడైంది ఒకటే నిజం...అను'కుల' మీడియాది మాత్రం దొంగ సర్వేలు!: విజయసాయి రెడ్డి

  • వైసీపీకి 120కి పైగా అసెంబ్లీ సీట్లు
  • 23 లోక్ సభ సీట్లు గ్యారంటీ
  • ఎల్లో మీడియాలో దొంగ సర్వేలు వస్తున్నాయన్న విజయసాయి
ఈ ఎన్నికల్లో గెలవనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా సర్వేల్లో ఇదే వెల్లడైందని, చంద్రబాబు పచ్చ మీడియా మాత్రం దొంగ సర్వేలను వదులుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"జాతీయ మీడియా సర్వేల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ 120 పైగా అసెంబ్లీ స్థానాలు, 23 లోక్ సభ సీట్లు గెలుస్తుందని అనేక సార్లు వెల్లడైంది. 6 నెలలుగా జరిపిన 30కి పైగా సర్వేల్లో ఫలితాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు అను’కుల’ మీడియా చంద్రబాబుదే గెలుపని దొంగ సర్వేలను వదుల్తున్నాయి" అని ఆరోపించారు. 
Go Back to Shorts
Vijay Sai Reddy
Twitter
Telugudesam
YSRCP

More Telugu News